కరెంటు సామాన్లు దొంగలించిన దొంగలను పట్టిన పోలీసులు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):ఈమధ్య కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి తొగర్రాయి సబ్ స్టేషన్ పరిధిలో స్తంభాలు మరియు వైర్లు మొత్తం డ్యామేజ్ అయినాయి.అట్టి కరెంటు సరఫరా కోసం కోదాడ ఏడి సూర్యాపేట స్టోర్ నుండి ఏఏఏ కండక్టర్ వైర్ మరియు ఏబి కేబుల్ తెప్పించి కరంట్ పునరుద్దరణ కోసం కాంట్రాక్టర్ల ఇచ్చి వర్క్ చేయించి నారు మిగిలిన ఏఏఏ కండక్టర్ వైర్ ఏబి కేబుల్ మిగతా వర్క్ కోసం తొగర్రాయి సబ్ స్టేషన్ బద్ర పరచగ తేదీ.16.09.2024 రోజు రాత్రి దాసరి వంశీ తండ్రి వెంకటేశ్వర్లు,వయస్సు 20 సం,లు,కులం:ఎస్సీ మాల, వృత్తి:కులీ, గ్రామం:వెలిదండ గ్రామం,గరిడేపల్లి మండలం,నామాల వీరబాబు తండ్రి సైదులు,వయస్సు 26 సం,లు, కులం పద్మ శాలి,వృత్తి:ఆటొ డ్రైవరు,గ్రామం:తొగర్రాయి గ్రామం,కోదాడ మండలం,సూర్యపేట జిల్లా ఇద్దరు కలసి సబ్ స్టేషన్‌లోకి ప్రవేశించి సుమారు ఏఏఏ కండక్టర్ వైర్ -2200 మీటర్లు,ఏబి కేబుల్-321 మీటర్లు వైరు ను (మొత్తం విలువ రూ.1,10,000/-) ఉంటాయి. వీరబాబు ఆటొ అయిన (ఆల్ఫా) నెంబర్ AP-16-TE-0881 లో తీసుకొని పోయి వీరబాబు ఇంటిలో దాచిపెట్టి ఈ రోజు వంశీ,వీరబాబు కలసి అట్టి కేబుల్ అమ్మటానికి ఆటొ వేసుకొని విజయవాడ కు వెళ్తుండగా ఉదయం సుమారు 09:00 గంటలకు నల్లబండగూడెం గ్రామంలో రామాపురం క్రాస్ రోడ్,వద్దకు కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి,వారి సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తూ వారిని పట్టుబడి పోయిన సొత్తును స్వాదినం చేసుకొని రిమాండ్ నిమిత్తం వారి ఇద్దరిని కోర్ట్ లో హాజరుపరచడం జరిగింది.ఇట్టి కేసును ఏడి కోదాడ వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నోమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసు ను చాక చక్యంగా ప్రధార్శించి కేసును ఛేదించి పోయిన ప్రభుత్వ సొత్తు ను స్వాదినం చేసిన కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి ఆధ్వర్యంలో ఎం అనిల్ రెడ్డి ఎస్సై కోదాడ రూరల్ మరియు సిబ్బంది ని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అభినందించినారు.