కర్మ లఘుచిత్రం టీజర్ విడుదల.
:లఘు చిత్రం నిర్మించడం అభినందనీయం.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ ప్రాంతానికి చెందిన కళాకారులు సందేశాత్మకమైన లఘు చిత్రం నిర్మించడం అభినందనీయమని టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని వారి నివాసంలో శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ పై మచ్చ లిఖిత సమర్పణలో నిర్మాత మచ్చ ఉపేందర్ సారధ్యంలో తెరకెక్కిస్తున్న కర్మ లఘు చిత్రం టీజర్ ను చిత్ర బృందం సభ్యులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి దర్శకుడు తిరుప్ ఏర్పుల సమాజాన్ని మేలుకొలిపే ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలతో చిత్రాలను తెరకెక్కించడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా చిత్ర బృందం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రతినిధి దొంగరి వెంకటేశ్వర్లు,తెరా సాంస్కృతిక వ్యవస్థాపక మండలి అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు,దర్శకుడు తిరుప్ ఏర్పుల,సినిమా నిర్మాత మచ్చ ఉపేందర్,కందుల కోటేశ్వరరావు,గంధం యాదగిరి,షాబుద్దీన్,బుడిగం నరేష్,వేలాద్రి, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.