కోదాడ,నవంబర్ 11(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని ఫెర్టిలైజర్స్ షాపుల యాజమాన్యం కల్తీ విత్తనాలు కల్తీ మందులతో రైతుల్ని మోసం చేస్తున్నారని రైతులు పట్టణ రహదారిపై ఆందోళనకు దిగారు. శనివారం కోదాడ పట్టణంలోని లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్స్ అండ్ జనరల్ మర్చంట్ షాపు ముందు కోదాడ మండల పరిధి లోని కూచిపూడి తండా,రామాంజనేయ తండా,కూచిపూడి,చిలుకూరు మండల పరిధిలోని దూదియా తండా గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. పట్టణంలో ట్రాఫిక్ స్తంభించడంతో స్థానిక పోలీసులు వచ్చి రైతుల సమస్యను తెలుసుకుని సంబంధిత ఫెర్టిలైజర్స్ యాజమాన్యంతో మాట్లాడదామని రైతులకు హామీ ఇవ్వడంతో వాళ్లు ధర్నాను విరమించుకొని రైతులు యాజమాన్యం వద్దకు వెళ్ళగా యాజమాన్యం మాట్లాడదామని మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు.

సంబంధిత రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడితో దుక్కులు దున్ని విత్తనాలు కొనుగోలు చేసి విత్తితే… తీరా పంట చేతికి వచ్చే టైం కు వరి కంకులు రాకుండా ఏపుగా పెరిగి.. కనీసం పొట్ట చేతికొచ్చే దశలో కంకి ఏర్పడకపోవడంతో నకిలీ విత్తనాలుగా గుర్తించాలమని వచ్చిన కంకులు మొత్తం పూర్తి తాలుగా ఏర్పడి నాలుగు అడుగుల మేర వరి పెరగడంతో కన్నీరు మున్నీరయ్యావని ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణం దగ్గరికి వచ్చి అడగగా వారు పట్టించుకోకపోవడంతో రాస్తారోకో చేశామని..

ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల అమ్మిన ఫెర్టిలైజర్ షాపులను తక్షణమే సంబంధిత అధికారులు సీజ్ చేయాలని అన్నారు.ఈ ధర్నాలో కూచిపూడి తండాకు చెందిన బాదావత్ హాజీ నాయక్,బాదావత్ భాస్కరరావు,బాదావత్ బాలు,జరుకుల విజయుడు,బాదావత్ బాలరాజు,రామాంజనేయ తండా రైతులు బాదావత్ కౌసల్య,లకావత్ శ్రీను,కుర్ర తేజ,కూచిపూడి రైతులు సన్నిదాని రమణ,కొండ గోపి,నాగేశ్వరరావు,దూదియా తండా రైతులు చందు,సీతారాం తదితర రైతులు పాల్గొన్నారు



