కళాకారుల ఆధ్వర్యంలో వరద బాధితుల విరాళాల సేకరణ
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కళాభివందనాలతో కోదాడ పట్టణంలో కోదాడ ఖమ్మం జిల్లా వరద బాధితుల విరాళాల సేకరణ కార్యక్రమం నాలుగు రోజులకు చేరుకున్నది ఇటి కార్యక్రమానికి కవులు కళాకారులు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది.ఆటపాటలతోటి డప్పు దరువులతోటి నృత్యం చేస్తూ వరద బాధితులను ఆదుకోవాలని అంటూ విరాళాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై వరద బాధితులైన తోటి వారికి సహాయపడాలని కోరుకుంటూ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పేరాల యాదగిరి ఆధ్వర్యంలో కొనసాగించడం జరిగింది ఈ కార్యక్రమం లో సూర్యాపేట జిల్లా కళాకారులందరూ పాల్గొనడం జరిగిందని కోట వీరస్వామి తెలిపారు.