కోదాడ,ఏప్రిల్ 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం(ఆస్క్) ఏర్పాటు చేసిన ఉచిత పాలిటెక్నిక్,టీఎస్ఆర్జెసి శిక్షణా నిర్వాహకుల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పట్టణ ఏఎస్ఐ పులి వెంకటేశ్వర్లు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతు సమాజంలో స్త్రీలు వెనుకబడడానికి,విద్యా,జ్ఞానం లేకపోవడం ప్రధాన కారణమని గ్రహించి స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన గొప్ప మహానుభావుడు ఫూలే అని అన్నారు.ప్రపంచాన్ని మార్చగల సాధనం విద్య ఒక్కటేనని ఈ విద్య ద్వారా ప్రజలు జ్ఞానవంతులు కావాలని అన్నారు.

ఈ ఉచిత కోచింగ్ సెంటర్ కు తనవంతు సహాయంగా 5000 రూపాయలు ఏఎస్ఐ పులి వెంకటేశ్వర్లు శిక్షణ నిర్వహణ కమిటీకి అందించారు.అనంతరం అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) ఫౌండర్,అధ్యక్షులు బల్గూరి దుర్గయ్య మాట్లాడుతూ1888 లో మహాత్మా అనే బిరుదును జ్యోతిరావు పూలే కు ప్రధానం చేయడం జరిగిందని అన్నారు.పూలే సామాజిక విప్లవాల పితామహుడు అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కోర్స్ డైరెక్టర్ ఎలమర్తి శౌరి,కోర్స్ కోఆరినేరుర్ గంధం బుచ్చిరావు,రమేష్,ఏ వెంకటేశ్వర్లు,నందిపాటి సైదులు,పిడమర్తి వెంకటేశ్వర్లు,చెరుకుపల్లి కిరణ్,చేకూరి రమేష్,మాగి గురవయ్య,అమరబోయిన వెంకటరత్నం, ఉపాధ్యాయులు ఆనంద్,గోపి,భాను ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



