తుంగతుర్తి నియోజకవర్గం(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)
మద్దిరాల మండల పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన కొమ్ము బిక్షం తుక్కుగూడలో జరిగినటువంటి సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో బైక్ ఢీకొనడం జరిగింది. ఆ ప్రమాదంలో తలకు గాయమై హైదరాబాద్ కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో కూడ ఎప్పటికప్పుడు డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి వైద్య వివరాలు తెలుసుకొని నేటివరకు కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉండి మనోధైర్యాన్ని ఇచ్చిన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నిన్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన బిక్షం ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకొని వారి భవిష్యత్ వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు 50,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి భవిష్యత్ లో కూడా వారి కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతిఒక్క కార్యకర్తను కడుపులో పెట్టుకుంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోదైర్యం నింపారు.