కాంగ్రెస్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ,జులై 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.బుధవారం హైదారాబాద్ లోని ఆమె నివాసంలో కోదాడ బీఎస్పీ మాజీ నియోజక వర్గ అధ్యక్షుడు కంభంపాటి శ్రావణ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.అనంతరం శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కన్వీనర్ యాతాకుల ప్రమోద్ కుమార్,నడిగూడెం మండల అధ్యక్షులు బుతుకూరి వెంకట్ రెడ్డి,సొసైటీ చైర్మన్ కొల్లు రామారావు,రంగారెడ్డి జిల్లా కన్వీనర్ నాగేళ్ళ శ్రీ రామ్ తదితరులు పాల్గొన్నారు.