కోదాడ,ఆగష్టు 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు.శనివారం మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పందిరి నాగిరెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.నేను కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నానని ప్రజలందరూ ఆదరించాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజలేవరు సంతోషంగా లేరని గత ఎన్నికల్లో బిజెపి,బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.రైతుల,రైతు కూలీల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వారి సంక్షేమానికి పెద్ద పీట వేసింది అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు జలంధర్,పాషా,రామకోటయ్య, రాజేష్, సాయి,కుమారి,సుజాత,నాగమ్మ తదితులున్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం.:రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి:కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి.
RELATED ARTICLES



