Sunday, February 22, 2026
[t4b-ticker]

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

:కోట్ల రూపాయల నిధులతో కోదాడను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళుతున్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

:కాంగ్రెస్ పార్టీ కొందరు పార్టీ కాదు అందరి పార్టీ

:మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 21(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోనే సాధ్యం అవుతాదని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు. శనివారం పట్టణ పరిధిలోని కెఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోటే సాధ్యమని అన్నారు. పట్టణంలో వేలకోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కు సర్వేలు జరుగుతున్నాయని అలాగే నూతన మున్సిపాలిటీ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజులలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ మున్సిపాలిటీని సందర్భంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు, డాక్టర్ శ్రీనివాసరావు, నరేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular