కోదాడ,నవంబర్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో మాజీ సర్పంచ్ టిడిపి రాష్ట్ర నాయకులు టిడిపి పార్టీకి రాజీనామా చేసి నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.తొండం సతీష్ కుమార్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తొండపు భాస్కరరావు రాజకీయ వారసత్వాన్ని సతీష్ కొనసాగిస్తున్నాడని అన్నారు.భవిష్యత్తులో మంచి నాయకుడిగా సతీష్ ఎదుగుతాడని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ దోపిడి అంతా ఇంతా లేదు అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఇంతవరకు చెక్కుచెదరలేదు కానీ కెసిఆర్ మూడు సంవత్సరాల క్రితం లక్ష కోట్లు పెట్టి కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతుందని కెసిఆర్ అవినీతికి ఇదే నిదర్శనం అని అన్నారు.మిషన్ భగీరథ 40 వేల కోట్లతో ప్రాజెక్టు పెట్టి అన్ని ఇళ్లకు నీరు అందిస్తానని చెప్పి ఇంతవరకు నీరు ఇవ్వని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు. కాపుగల్లు పరిసర ప్రాంతాలలో ఉన్న మట్టి గుట్టలను అధికార పార్టీ నాయకులు కొల్లగొట్టారని అంతే కాకుండా గతంలో మట్టి 2500 పెడితే ఇల్లు కట్టుకునే యజమానికి దొరికేది కానీ ఇప్పుడు 1500 పెట్టిన మట్టి దొరకట్లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు,మాజీ డిసిసిబి చైర్మన్ పాండురంగారావు,ఎర్రవరం పిఎస్సిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు,చింతకుంట్ల లక్ష్మీనారాయణ,కౌండిన్య గౌడ సంఘ జాతీయ అధ్యక్షులు కెఎల్ఎన్ ప్రసాద్,వంగవీటి రామారావు,పారసీతయ్య,సాదినేని అప్పారావు,మల్లెల బ్రహ్మయ్య,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



