కోదాడ,నవంబర్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీలోనే సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి అన్నారు.నడిగూడెం మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన బిఎస్పీ నాయకులు కార్యకర్తలు బుధవారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అన్ని మతాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. అనంతరం బీఎస్పీ మండల అధ్యక్షులు నేలమర్రి శ్యామ్ మాట్లాడుతూ యువకులకు నిరుద్యోగులకు వృద్ధులకు అన్ని పథకాలలో సముచిత స్థానం దక్కాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. డీఎస్పీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో నా మాట విని చేరిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నన్ను నమ్ముకుని వచ్చిన ప్రతి ఒకరికి అన్ని విధాల తోడుగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బూతుకూరి వెంకటరెడ్డి,మండల కార్యదర్శి వేపూరి సుధీర్,నడిగూడెం కాంగ్రెస్ నాయకులు బాణాల నాగరాజు,పగడాల ప్రభాకర్,బడేటి వెంకటేశ్వర్లు,దేవబపతిని రమేష్,గడ్డం మల్లేష్,గుజ్జా అంజి,రాము,విజయరామారావు, బిఎస్పీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారు నవీన్,వంశీ,నాగరాజు,హరీష్,శ్రీహరి,మందుల వంశీ,నేలమర్రి వంశీ,సతీష్,కోటేశ్వరరావు,హరి,రాకేష్,గణేష్,వీరయ్య,సుందర్రావు,శ్రీను,గోపి,రంజిత్ మరి కొంతమంది జాయిన్ అయినారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఎస్పి నాయకులు
RELATED ARTICLES



