కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు వంటెపాక జానకి యేసయ్య
కోదాడ,మే 08 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఉత్తమ్ పద్మావతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కోదాడ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యురాలు వంటెపాక జానకి యెషయా పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని వారు అన్నారు.బిఆర్ఎస్ పార్టీని వేడి కాంగ్రెస్ పార్టీలో చేరడం సొంత ఇంటికి చేరిన ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలోమునిసిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల,13 వ వార్డు కౌన్సిలర్ నిరంజన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కుడుముల లక్ష్మీనారాయణ,యునైటెడ్ పోస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వంటెపాక యెషయా,కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు జి ఆర్ అబ్రహం,కాంగ్రెస్ పార్టీ నాయకులు పంది తిరపతయ్య,గుండెపంగు రమేష్,కోదాడ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుడుముల రాంబాబు,యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అనంతగిరి మండల అధ్యక్షులు రామారావు,పట్టణ ఉపాధ్యక్షులు ప్రభుదాస్,పాస్టర్ అబ్రహం,పాస్టర్ శాంత వర్ధన్,పాస్టర్ వినోద్,పాస్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.



