కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్ఎంపీ డాక్టర్ కాసాని వెంకటేశ్వర్లు
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 30(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి కాసాని వెంకటేశ్వర్లు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, కోదాడ మాజీ వైస్ ఎంపీపీ మందలపు శేషయ్యలు కాసాని వెంకటేశ్వర్లుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని గుర్తు చేశారు. కాసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినదని అన్నారు.



