కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల నేతలు పరస్పరం దాడి
:లోకల్ బాడీ ఎలక్షన్ లో నేనుండాలి నేనుండాలి అనే ఆధిపత్య పోరు వలన ఈ దాడులు
:ఇండ్ల వస్తువులు,బైకులను ధ్వంసం చేసిన ఇరు వర్గాలు
:చిన్నపిల్లలు ఆడుకునే ఆటలను అదునుగా చేసుకొని గొడవలకు దిగుతున్న వైనం
Mbmtelugunews//హుజూర్ నగర్,మార్చి 31 ప్రతినిధి చింతా రెడ్డి గోపిరెడ్డి)సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల నేతలు పరస్పరం దాడి ఘటన ఆదివారం సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.గ్రామస్తులు తెలిపిన ప్రకారం
గత కొంతకాలంగా గ్రామంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది,ఈ క్రమంలో చిన్న పిల్లలు ఆటలు ఆడుకునే సమయంలో జరిగిన చిన్న ఘటన వల్ల చిలికి చిలికి తుఫాన్ లా మారింది.ఈ ఆటలాడుకునే దగ్గర ఇరువర్గాల పిల్లలు గొడవ పెట్టుకోవడం చేత ఒక వర్గం పిల్లలు మరో వర్గం వారిని గాయపరచడంతో మొదలైనవి.అది చివరికి పెద్దల గొడవల వరకు దారి తీసిన సంఘటన.ఒక ఒకవైపు పప్పు జాను వర్గం,మరొకవైపు దాదా బుడే వర్గం వారు చిన్నపిల్లల గొడవ కారణంను అదునుగా చూసుకొని ఇరు వర్గాల వారు ఒకరి ఇళ్లపై ఒకరు ఆదివారం రాత్రి సమయంలో రాళ్లు,కర్రలు,గొడ్డలితో,ఇంట్లోని ఫర్నిచర్ లను,బైకులను పగలగొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు.

ఆ సమయంలో ఎవరైనా అడ్డం వచ్చిన వారిపై దాడి చేయగా ఇరుగవర్గాల వారికి తీవ్ర గాయాల అయ్యాయి.చింతలపాలెం పోలీసు వారికి సమాచారం ఇవ్వటంతో పోలీసు వారు అక్కడకు చేరుకొని పరస్పర దాడులను ఆపి గ్రామంలో పోలీస్ పికటింగును ఏర్పాటు చేశారు.ఈ దాడిలో పదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు.అసలు ఈ గొడవకు కారణం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్,ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీ తరఫున నేనుండాలి నేనుండాలి అనే ఆధిపత్య పోరు వలన ఈ దాడులు జరుగుతున్నాయని గ్రామ ప్రజలు చెప్తున్నారు.ఈ సంఘటన తెలిసిన వెంటనే కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి,రూరల్ సీఐ రజిత రెడ్డి హుటా హుటిన కిష్టాపురం గ్రామానికి చేరుకొన్నారు.దాడి జరిగిన ఇళ్లను పరిశీలించి,దాడి జరిగిన వారి వివరాలు తెలుసుకొని దాడికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.పోలీస్ పికెటింగ్ ను గ్రామంలో పరిస్థితులు సర్దుమనిగిందాక ఏర్పాటు చేస్తామని చెప్పారు.నిందితులను త్వరగా పట్టుకుంటామని చెప్పారు.