కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడి ఎన్నికల్లో కుక్కడపు మహేష్ విజయం
Mbmtelugunews//హుజూర్ నగర్/మేళ్లచెరువు,డిసెంబర్ 5(చింతా రెడ్డి గోపిరెడ్డి):కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎన్నికల్లో కుక్కడపు మహేష్ గౌడ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికల్లో భాగంగా జరిగిన హుజూర్నగర్ నియోజకవర్గ యూత్ అధ్యక్ష ఎన్నికల్లో హుజూర్నగర్ ముద్దుబిడ్డ, వెల్లటూరు రౌత్ శ్రీను అల్లుడు కుక్కడపు మహేష్ 1400 ఓట్లతో గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కుక్కడపు మహేష్ ను మేళ్లచెరువు మండలం వెల్లటూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అబ్బిరెడ్డి వెంకటరెడ్డి , దాసు సైదులు గౌడ్, కేతపల్లి శంభయ్య, రౌతు సైదులు, కేతపల్లి సురేష్, వీరాస్వామి, శరత్, జానయ్య, కనకయ్య, శేషం గోపి, ప్రసాద్, దాసు వీరబాబు, గోపి, వెల్లటూర్ గ్రామీణ వైద్యులు నాగరాజు తదిర్లు పాల్గోని పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కుక్కడప్పు మహేష్ మాట్లాడుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆశీర్వాదంతో కాంగ్రెస్ హుజూర్నగర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని, తన గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన పై ఉంచిన నమ్మకంతో బాధ్యతాయుతంగా పనిచేస్తూ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.