కోదాడ,మార్చి 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ ఆధ్వర్యంలో పట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా షేక్ రఫీ మహిళలకు అరటి పండ్లు పంపిణీ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని,మహిళా ప్రజాప్రతినిధిగా ఉంటూ కోదాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో కోదాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళుతుందని అన్నారు.మహిళలు దేనిలోనూ తీసుపోరు అనే విధంగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజానాయకురాలుగా పేరు గడించిన పద్మావతి రెడ్డి నాయకత్వంలో తాను పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందదాయకంగా ఉందని రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు సహకారంతో నిరుపేద మహిళలకు తనవంతు చేయూతనిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో షాహినా,లలిత,బేబీ,అనసూర్య,రుక్సాన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES



