కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల కోటమ్మ లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ లో చేరిక
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 6(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామంలో రామలక్ష్మీపురం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల కోటమ్మ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల కోటమ్మ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశానని గుర్తు చేశారు. అయినా సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బి ఆర్ ఎస్ పార్టీలో చేరినానని బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి విత్ డ్రా అయి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినందుకు బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెల్లంకొండ బ్రహ్మ, గ్రామ శాఖ అధ్యక్షులు అంజిరెడ్డి, రైతు సమన్వయ అధ్యక్షులు అన్నెం వెంకటరెడ్డి, సోమిరెడ్డి, అన్నెం శ్రీనివాసరెడ్డి, వెంకట రెడ్డి, పాముల రాంబాబు, తుపాకుల నరేష్, పాముల రాదయ్య, పాముల రాజశేఖర్, పాముల రమేష్, అన్నెం శ్రీనివాసరెడ్డి,మేళ్లచెరువు లచ్చయ్య, బుడేగ సాయిలు, జెసిబి రమేష్, పాముల ప్రభాకర్, పాముల అమీన్, రేడపంగు రాములు, పాముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



