Friday, December 26, 2025
[t4b-ticker]

కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట:కేటీఆర్

కోదాడ,డిసెంబర్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. గురువారం జరగబోయే గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని, *రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు ఇచ్చారని చెప్తారని* వ్యాఖ్యానించారు. *అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.*

*అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని* ప్రశ్నించారు. *తొలి కేబినెట్ భేటీలోనే ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న మాట ఏమైందని,* *హామీలిచ్చినపుడు ఆ సంగతి తెలియదా* అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరుగలేదని, ప్రతి ఏడాది కాగ్ నివేదికలు ఇస్తున్నారని, అదేవిధంగా ప్రతి ఏటా ఆడిట్‌ లెక్కలు తీస్తున్నామని ఆయన వివరించారు. *తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని* కేటీఆర్ స్పష్టం చేశారు.  *ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలిస్తామన్నారు.* అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వట్లేదని ఆక్షేపించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular