కాంగ్రెస్ మేనిఫెస్టో మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి…..
:ఆగస్టు 23న సిపిఎస్ కి వ్యతిరేకంగా బ్లాక్ డే, జీవో 28 ప్రతులను చించి వేసి,నిరసన…
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 23:ఉద్యోగ ఉపాధ్యాయులు పదవి విరమణ పొందిన తర్వాత సిపిఎస్ విధానంలో పెన్షన్ కు భద్రతా భరోసా లేదని ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని,కాంగ్రెస్ మేనిఫెస్టో మేరకు సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగ సంఘ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం నాడు కోదాడలో బాలుర ఉన్నత పాఠశాల యందు భోజన విరామ సమయంలో సిపిఎస్ కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలను ధరించి ప్లే కార్డులతో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.రాష్ట్ర ఉద్యోగులకు సిపిఎస్ విధానం లోకి తీసుకొని వచ్చిన ఆగస్టు 23 బ్లాక్ డే గా భావిస్తున్నట్లు,జీవో28 ప్రతులను చించి వేసి,నిరసన ప్రదర్శన నిర్వహించారు.సిపిఎస్ ను రద్దు చేయాలని పాత పెన్షన్ పొందుతున్న ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎస్ కమిటీ కోదాడ మండల బాధ్యులు ఎం జానకిరామ్,ఎండి ముక్తార్,కే విజయ,పాత పెన్షన్ ఉపాధ్యాయ మిత్రులు పాల్గొన్నారు.