కాంగ్రెస్ రైతు భరోసా ఎగవేతపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు
:రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.
:మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 19 (ప్రతినిధి మాతంగి సురేష్)రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, బీఆర్ఎస్ రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.శనివారం కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా అందిస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రేపు కోదాడ నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు కోదాడ,అనంతగిరి,మునగాల,చిలుకూరు,నడిగూడెం,మోతే మండల కేంద్రాలలో రైతులు,ప్రధాన నాయకులు,కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.