కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం వనభోజ మహోత్సవం విజయవంతం చేయాలి.
వనభోజన మహోత్సవాలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు.
నవంబర్ 10న కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం వనభోజనం వేడుక…
కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్):కార్తీక మాస వనభోజన మహోత్సవాలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు .నవంబర్ 10వ తేదీన ద్వారకుంట ఇండస్ట్రియల్ ఏరియా వద్ద తమ మామిడి తోటలో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో జరిగే ఈ వనమహోత్సవానికి నియోజకవర్గ వ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గం సోదరులు హాజరుకావాలని కోరారు. వనభోజన మహోత్సవం ఆత్మగౌరవంతో నిర్వహించుకుని సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కోదాడ నియోజకవర్గం తోపాటు మేళ్లచెరువు మండలం, పరిసర గ్రామాల్లో నివసించే కమ్మ సహోదరులు కూడా హాజరుకావాలని కోరారు.ఈసమావేశం లో కోదాడ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పోటు కోటేశ్వరరావు,చుండూరు వెంకటేశ్వరరావు,నలజాల శ్రీనివాసరావు,కర్రీ సుబ్బారావు,రావెళ్ల కృష్ణారావు,సాతులూరి హనుమంతరావు,వేమూరి విద్యాసాగర్,చావ హరినాథ్,భాగం కోటయ్య,లైటింగ్ ప్రసాద్,గద్దె వెంకటయ్య,చుండూరు ప్రసాద్,పొందూరి రమేష్,గోర్తి దినేష్,ముత్తవరపు రామారావు,ముత్తవరపు కోటేశ్వరరావు,నల్లపునేని కృష్ణారావు,దండా వీరభద్రం,సాదనేని అప్పారావు,ఒక్క వంతుల శ్రీనివాసరావు,గద్దె రఘు,మల్లెల పుల్లయ్య,తాళ్లూరి శేషగిరిరావు,చుండూరి విద్యాసాగర్ తదితర నాయకులు పాల్గొన్నారు.