కానిస్టేబుల్ కందికొండ శ్రీను ను పరమర్శించిన చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,జనవరి 06 (ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కందికొండ శ్రీను కు ఈ మధ్యకాలంలో బైక్ ఆక్సిడెంట్ లో కాలు ఫ్రాక్చర్ కావడం జరిగినది. మెరుగైన వైద్య నిమిత్తం హైదరాబాదు లో ఓ ప్రైవేట్ హాస్పటల్లో వెళ్లడం జరిగింది వారిని సోమవారం టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం జరిగినది. వారి వెంట ఎలక నరేందర్ రెడ్డి,మట్ట పుల్లయ్య లు ఉన్నారు.