Wednesday, March 25, 2026
[t4b-ticker]

కాపుగల్లు అంగనవాడి కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మి కమిటీ ఏర్పాటు

కాపుగల్లు అంగనవాడి కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మి కమిటీ ఏర్పాటు

Mbmtelugunews//కోదాడ, మార్చి 25(ప్రతినిధి మాతంగి సురేష్): కాపుగల్లు గ్రామంలో అంగనవాడి 1, 2, 4 కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మి కమిటీని ఈరోజు ఉదయం గ్రామ సర్పంచి దొంతగాని అప్పారావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా గ్రామ సర్పంచి దొంతగాని అప్పారావును ఎన్నుకోగా, కార్యదర్శులుగా అంగనవాడి టీచర్లు తిరుమలమ్మ, నాగలక్ష్మి, మరియమ్మలను నియమించారు. కమిటీ సభ్యులుగా రిటైర్డ్ ఉద్యోగి చిగురుపాటి వెంకటేశ్వర్లు, సైన్స్ టీచర్ వి చంద్రశేఖర్‌లను ఎంపిక చేశారు. అనంతరం గ్రామ సర్పంచి ఎమ్‌పీపీఎస్ కాపుగల్లు పాఠశాల వంటగదిని పరిశీలించారు. అంగనవాడి కేంద్రంలోని సరుకులను కూడా తనిఖీ చేశారు. తర్వాత అంగనవాడి రెండో సెంటర్‌లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular