Thursday, March 5, 2026
[t4b-ticker]

కాపుగల్లు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు సీమంతం

కాపుగల్లు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు సీమంతం

Mbmtelugunews//కోదాడ, మర్చి 05(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు గురువారం సాంప్రదాయబద్ధంగా సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దొంతగాని అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ మహిళలను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు పండ్లు, పోషకాహార పదార్థాలు అందజేసి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలని, ప్రభుత్వ ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular