కోదాడ,సెప్టెంబర్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాపుగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము నందు ఈ రోజు సర్వ సభ్య సమావేశం అధ్యక్షులు నంబూరి సూర్యం అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశములో భాగంగా సంఘము యొక్క అర్ధ వార్షిక పద్దులను చర్చించడం జరిగింది.అదేవిధముగా రైతుల ఉపయోగార్ధము నిర్మిస్తున్న ధాన్యము నిల్వచేయు 1000మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణ పనులు ఎంత వరకు జరిగాయో వివరించడం జరిగింది.అనంతరం రుణమాఫీ వచ్చిన రైతులకు రుణమాఫీ పొందిన పత్రాలను అందజేయటం జరిగినది.ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు నల్లూరి రమేష్,ముత్తవరపు వీరయ్య,గుండేబోయిన వీరబాబు,మల్లెల రోశయ్య,ఏజండ్ల సులోచన,జిల్లా వెంకటేశ్వర్లు,మల్లెల ఆదినారాయణ,పోలంపల్లి అచ్చమ్మ,బాలెబోయిన వెంకటేశ్వర్లు,మార్తి లక్ష్మీ నర్సయ్య మరియు రైతులు ఉన్నం హనుమంతరావు,వీరబాబు,రాజు,బాబురావు సంఘ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.
కాపుగల్లు పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం
RELATED ARTICLES



