కోదాడ,నవంబర్ 22(మనం న్యూస్)ప్రతినిధి మాతంగి సురేష్:నడిగూడెం మండల కేంద్రంలోని సుందరయ్య భవన్లో ఈరోజు డివైఎఫ్ఐ కోదాడ మాజీ డివిజన్ అధ్యక్షులు తాడవాయి సింగిల్ విండో మాజీ చైర్మన్ సిపిఎం డివిజన్ నాయకులు మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన కామ్రేడ్ బొంత శ్రీనివాస్ రెడ్డి 17వ వర్ధంతి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.వర్ధంతి కార్యక్రమానికి డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ హాజరై మాట్లాడుతూ కామ్రేడ్ బొంత శ్రీనివాస్ రెడ్డి నరసింహులగూడెం గ్రామ అభివృద్ధికి పేదలకు దళిత బహుజనులకు అండగా ఉంటూ సిపిఎం పార్టీ నాయకునిగా డివైఎఫ్ఐ యువజన సంఘం నాయకునిగా యువతకు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ నాటి కాంగ్రెస్ అరాచకాలను,ఆగడాలను ఎదుర్కొని ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న క్రమంలో ఓర్వలేని నరహంతక కాంగ్రెస్ ముఠా బొంత శ్రీనివాస్ రెడ్డిని 2007 నవంబర్ 22వ తేదీన ఆకుపాముల పాల కేంద్రం వద్ద అతికిరాతకంగా కాంగ్రెస్ గుండాలు నరికి హత్య చేశారు. కామ్రేడ్ ముదిరెడ్డి ఆదిరెడ్డి, శ్రీనివాసరెడ్డి,నేటి పులిందర్ రెడ్డిలను కాంగ్రెస్ గుండాలు అక్రమంగా పొట్టన పెట్టుకున్న అయినను నేటికీ నరసింహగూడెం, మునగాల పరగణ,కోదాడ డివిజన్ ప్రాంతంలో సిపిఎం పార్టీ కామ్రేడ్ బొంత శ్రీనివాస్ రెడ్డి ఆశయ సాధన ముందుకు పోతూ అన్యాయాలను,అక్రమాలలో ఎదుర్కొంటూ,ఎన్ని దౌర్జన్యాలు చేసిన నేటి వరకు ప్రజల పక్షాన నిలబడ్డారు.కావున నేటి యువత ఆయన ఆశయ సాధనలో ముందుండి ఈ కాంగ్రెస్ కెసిఆర్ లకు వ్యతిరేకంగా రేపు జరిగే ఎన్నికలలో సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్నగర్ లలో నిలబడ్డ సిపిఎం పార్టీ అభ్యర్థులు మట్టిపల్లి సైదులు, మల్లు లక్ష్మి లకు ఓట్లు వేసి గెలిపించాలని ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు జమ్మి ఎల్లయ్య,కోరుట్ల బ్రహ్మయ్య, కాసాని వినోద్,కామల్ల ప్రవీణ్,సైదులు,రామయ్య తదిరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ బొంత శ్రీనివాస్ రెడ్డి 22వ వర్ధంతి.:అమరవీరుల ఆశయ సాధనలో యువత ముందుండాలి:కాసాని కిషోర్ డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు
RELATED ARTICLES



