మునగాల,జనవరి13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని మాధవరం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివ రాల ప్రకారం.మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన జాలా నాగమణి రోడ్డు దాటు తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న AP39HF1234 నెంబర్ గల కారు ఢీకొట్టి వెళ్లింది.నాగలక్ష్మి కి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం 108లో ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోలీసులకు మునగాల వద్ద కారును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
RELATED ARTICLES



