కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
Mbmtelugunews//హుజూర్ నగర్/మేళ్లచెరువు,నవంబర్ 15(ప్రతినిధి చింతా రెడ్డి గోపిరెడ్డి):కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సన్నిధి కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ గేయ రచయిత త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి దంపతులు అయ్యప్ప స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అయ్యప్ప గుడి కమిటీ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి దంపతులకు శాలవతో సత్కరించారు.తర్వాత వారు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు
ఈ కార్యక్రమంలోమేళ్లచెరువు అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు , తాళ్లూరి గిరి స్వామి,కున్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి స్వామి,సాముల వెంకట్ రెడ్డి స్వామి,సంఘనీ శీను స్వామి,గురుస్వాములు,మలదరించిన స్వాములందరూ పాల్గొన్నారు.