కార్పొరేట్ కళాశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి
ఆర కొర ఫ్యాకల్టీ తో విద్యార్థులను అధిక ఒత్తిళ్లకు గురి చేస్తున్న ప్రైవేట్ కళాశాలలు
విద్యార్థులను కళాశాలలో బంధించి వాళ్లపై ర్యాంకుల కోసం అధిక భారం మోపుతున్న కళాశాలలకు బుద్ధి చెప్పాలి
Mbmtelugunews//చిలుకూరు,అక్టోబర్ 20:చిలుకూరు మండల కేంద్రం సమీపంలోని కవిత జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వినయ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. హుజూర్నగర్ మండలం సబ్జా పురం గ్రామానికి చెందిన వినయ్ దసరా సెలవులు ముగించుకుని ఆదివారం ఉదయం కళాశాలకు వచ్చిన వినయ్ భోజనం సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.కళాశాల యాజమాన్యం హుటాహుటిన వినయ్ ను కోదాడ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికె మృతిచెందాడు.మార్కులు తక్కువ వచ్చాయని టీచర్లు మందలించినందుకే మా కుమారుడు మనస్తాపంతో తమ బలవన్ మరణానికి పాల్పడ్డట్లు కన్నీరు మున్నీరయ్యారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రాంబాబు గౌడ్ దర్యాప్తు చేపట్టారు..
*కాలేజీని తక్షణమే మూసివేయాలి:ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్*
ఆర కొర ఫ్యాకల్టీ తో విద్యార్థులను అధిక ఒత్తిళ్లకు గురి చేస్తు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ కళాశాలలను గుర్తించి ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ (టిఎస్ఏ)రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ అన్నారు.మార్కుల పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న కవితా కళాశాలను తక్షణమే మూసివేయాలి.జిల్లా ఇంటర్మేడియట్ విద్యా అధికారి(డీఐఈవో)సంబంధిత కళాశాల యాజమాన్యం పై తకు చర్యలు తీసుకొని కళాశాల పర్మిషన్ను రద్దు చేయాలని టిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.