దోపిడి రాజ్యం పోవాలే – కార్మికుల రాజ్యం రావాలి
:కార్మిక,కర్షక హక్కులకై నిరంతరం పోరాడుదాం:జె.నరసింహారావు
చిలుకూరు,మే 01(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:దేశంలోప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యాం కొరకు పోరాడుదాం అని కార్మిక కర్షక హక్కులకై నిరంతరం కృషి చేద్దామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జె.నర్సింహరావు అన్నారు.మేడే సందర్భంగా చిలుకూరు మండల బేతవోలు,మాదవగూడె౦ గ్రామాలలో.. పాటు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జండా ఆవిష్కరణ హమాలి వర్కర్స్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది.ఈ సందర్భంగా జె నర్సింహరావు* మాట్లాడుతూ కార్మికులు కర్షకులు ఈ దేశ నిర్మాతలని వారి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు.అమెరికా నగరం చికాగో పట్టణంలో లక్షలాదిమంది కార్మికులు 12 గంటల పని విధానం రద్దుయ్యే వరకు పోరాడి వీలది మంది కార్మికులు ఆత్మబలిదానం చేసిన రోజు మే 1 మే డే దినోత్సవం అని తెలిపారు.సమస్త ప్రజలకు మేడే శుభాకాంక్షలు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచడం కార్మికుల చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను అణిచివేసే కుట్రలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దేశంలో కార్మిక కర్షక రాజ్యం ఆవిర్భావం తప్పక జరుగుతుందని అన్నారు.సిపిఎం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాల నిర్వహిస్తుందని భూమి బుక్తీ విముక్తికై సాగిన తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాగేటి రాములు,సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ బత్తిని వెంకటయ్య,,బేతవోలు కార్యదర్శి ఎగ్గడి లింగయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిన్న పాప,నారసాని వెంకటేశ్వర్లు,మాధవ గూడెం శాఖ కార్యదర్శి గదపాటి కిరణ్,గొర్ల పెంపకదార జిల్లా నాయకులు పిల్లి వీర మల్లయ్య,కోటయ్య,కోటేశ్వరరావు,అంజయ్య,బాబు,రామారావు తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



