కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు
:మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.
Mbmtelugunews//కోదాడ(నడిగూడెం), ఆగస్టు 17: కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వల్లపు వెంకన్న గుండెపోటుతో మృతి చెందటతో ఆయన మృతదేహంపై పార్టీ కండవా కప్పి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో అభ్యర్థుల గెలుపులో ఆనాటి నుంచి నేటి వరకు ఎంతోమంది కార్యకర్తలు పార్టీ బలోపేతం కృషి చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారన్నారు. పార్టీ ఎదుగుదలలో కార్యకర్తలు ముఖ్యభూమిక వహిస్తున్నారన్నారు అన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం వెంకన్న చేసిన సేవలను కొనియాడారు. వెంకన్న కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, సీనియర్ నాయకులు పందిరి వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ చిన్న గుండు శ్రీను, మాజీ వార్డ్ నెంబర్లు పల్లపు శీను, వల్లెపు శ్రీను, నాయకులు పల్లపు భూపాల్, ఉపతల శ్రీను, పెద్ద తిరుమలి, కుంజ మురళి, సందీప్, శ్రీకాంత్, శేఖర్, మహేష్, చంటి, సత్యం, వీరబాబు, వీరస్వామి, నాగరాజు తదితరు నివాళులర్పించారు



