కాస్మొటిక్,మెస్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 14 (ప్రతినిధి మాతంగి సురేష్)కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కులాల మతాల వారికి నాణ్యమైన విద్యని అందించాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కాస్మోటిక్,మెస్ చార్జీలు పెంచిందని స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు.శనివారం కోదాడలో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో కాస్మొటిక్ & మెస్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల విద్యార్థినీ విద్యార్థులు నాణ్యమైన చదువుతోపాటు వారికి నాణ్యమైన భోజనం వసతులు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చార్జీలు పెంచి విద్యార్థుల విద్యను ప్రోత్సహిస్తుందని అన్నారు.అనంతరం హాస్టల్ లో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వి చందర్ రావు,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,ఎమ్మార్వో వాజిద్ హలీ,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.