కిట్స్ సివిల్ విద్యార్థినికి గేట్ (గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ) జాతీయ స్థాయి పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్
Mbmtelugunews//కోదాడ, మార్చి 20( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న అప్పన్న ఉషారాణి విద్యార్థినికి 2026వ సంవత్సరం ప్రకటించిన పలితాలలో ఆలిండియా గేట్ ( జాతీయ స్థాయి పరీక్ష) లో 7106 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంక్ ద్వారా జాతీయ స్థాయి లో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు అయినటువంటి ఐఐటీ, ఎన్ఐటి వంటి విద్యాసంస్థలో ఎంటెక్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ) విద్య పూర్తి చేయుటకు అర్హత సాధించినట్లుకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ తెలిపారు.
ఈ జాతీయ స్థాయి పరీక్ష అయిన గేట్ లో ర్యాంక్ సాధించిన విద్యార్థిని ని కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, కళాశాల డైరెక్టర్ నాగారర్జునరావు, విభాగాధిపతి లక్ష్మణ్, సివిల్ అధ్యాపక సిబ్బంది, అభినందించారు.



