కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి
కోదాడ,మే02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నల్లగొండ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించే సమావేశానికి గుడిబండ గ్రామం నుంచి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో బిఆర్ఎస్,బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు.గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి గ్రామంలో అత్యధిక మెజారిటీ ఇచ్చామని అన్నారు.జరగబోయే లోక్ సభ ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో అత్యధిక మెజారిటీని ఇస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



