కుడుముల శివ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Mbmtelugunews//కోదాడ,మార్చి 22 (ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ లోని గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఫాన్స్ అధ్యక్షులు కుడుముల శివ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నాడు 27 తారీకు న జరగబోయే రాంచరణ్ బర్త్డే వేడుకల సందర్బంగా గవర్నమెంట్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ ఎన్ఆర్ గ్రౌండ్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం రక్తదానం శిబిరంలో రక్తదాతలకు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగ అధ్యక్షురాలు గరీణె ఉమామహేశ్వరి శ్రీధర్,ప్రధాన కార్యదర్శి,ఓరుగంటి విజయలక్ష్మి పాండు తదితర సభ్యులు,పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ పట్టణ అధ్యక్షులు కుడుముల ప్రశాంత్,సన్నీరు మురళి,ఓరుగంటి పాండు,పొట్ట శంకర్ నాయుడు,కస్తూరి సురేష్,యమ్ వెంకటేష్,సిద్దెల అంజిబాబు,అన్నేపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.