సూర్యాపేట జిల్లా:తిర్మలగిరి(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)సమగ్ర కుల గణన జరిపిన తరువాతనే రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బి సి సంక్షేమ సంఘం. జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్యక్రమం లో పాల్గొనేందుకు నేడు తిరుమలగిరి వచ్చిన ఆయన స్థానిక బి సి సంక్షేమ సంఘం నాయకుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బి సి లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు లేని ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు పోతే బి సి బలగాలతో రాష్ట్రం ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు,రిలే నిరాహార దీక్షలతో అట్టుడికిస్తామని హెచ్చరించారు. కామారెడ్డి బి సి డిక్లరేషన్ అమలు పరిచి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో బి సి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్,గో.పా అధ్యక్షులు బండి సాయన్న,లింగం గౌడ్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం, జిల్లా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి కాసాని శ్యామ్,నాయకులు వంగరి సోమకృష్ణ,ఎనగందుల రవి,తదితరులు పాల్గొన్నారు.