కులమతాలకు,మతసామరస్యానికి ప్రతీక హోలీ:మేకల వెంకటరావు
Mbmtelugunews//కోదాడ,మార్చి 14(ప్రతినిధి మాతంగి సురేష్):హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం కుల,మతాలకు అతీతంగా చిన్నా, పెద్ద,ఆడ,మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ హోలీ పండుగ అని అడ్వకేట్ మేకల వెంకటరావు అన్నారు.శుక్రవారం అడ్వకేట్స్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు అడ్వకేట్స్ మాట్లాడుతూ దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి హోలీ పండుగని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ రంగులు చల్లుకుంటారని అన్నారు.హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఆనందాలు వెళ్లివిరియాలని కోరారు.

ఈ పండుగను ప్రజలు పువ్వులతో తయారు చేసిన రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.ఇలా పూల రంగులు చల్లుకోవడం ద్వారా ప్రేమ,సౌభాగ్యాలు వెల్లివిరి స్తాయని నమ్ముతారని అన్నారు.హోలీ పండుగ సహజమైన రంగులతో జరుపుకోవాలని అన్నారు.హోలీ అనంతరం స్నానాలకు బావుల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితమైన ప్రాంతాలలోని స్నానాలు ఆచరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు,కామిశెట్టి వెంకటేశ్వర్లు,వెంకటాచలం,కోడూరి వెంకన్న,తాటి మురళి,హనుమంతరావు,సామా నవీన్,శివ కృష్ణ,ఆవుల మల్లికార్జున్,మంద వెంకటేశ్వర్లు,షేక్ పాషా,హనుమతరాజు,సీతారామరాజు,కే మురళి తదితరులు పాల్గొన్నారు.