Wednesday, March 4, 2026
[t4b-ticker]

కులమతాలకు,మతసామరస్యానికి ప్రతీక హోలీ: కౌన్సిలర్ ఉమా ఆంజన్ గౌడ్

కులమతాలకు,మతసామరస్యానికి ప్రతీక హోలీ: కౌన్సిలర్ ఉమా ఆంజన్ గౌడ్

mbmtelugunews//కోదాడ,మార్చి03 (ప్రతినిధి మాతంగి సురేష్):హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం కుల,మతాలకు అతీతంగా చిన్నా,పెద్ద,ఆడ,మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ హోలీ పండుగ అని 30 వ వార్డు కౌన్సిలర్ కారింగుల ఉమా అంజన్ గౌడ్ అన్నారు. మంగళవారం రాజీవ్ నగర్ వీధిలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కారింగుల ఉమా అంజన్ గౌడ్ మాట్లాడుతూ దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి హోలీ పండుగని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ రంగులు చల్లుకుంటారని అన్నారు.హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఆనందాలు వెళ్లివిరియాలని కోరారు.ఈ పండుగను ప్రజలు పువ్వులతో,రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.ఇలా రంగులు,పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ,సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారని అన్నారు.హోలీ పండుగ సహజమైన రంగులతో జరుపుకోవాలని అన్నారు.హోలీ అనంతరం స్నానాలకు బావుల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితమైన ప్రాంతాలలోని స్నానాలు ఆచరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా యూత్ అధ్యక్షులు కొలిపాక రాజేష్, చలిగంటి ఉపేందర్, మిరియాల సైదులు, ఎర్రంశెట్టి రవీందర్, గోపి, కార్తీక్, సత్తార్, శ్రీకాంత్, మనోజ్, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular