కోదాడ,అక్టోబర్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉద్యోగం సాధించిన ఫరీద్ ను అభినందించిన శ్రీ సాయి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అనంతారపు కృష్ణయ్య.కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లో కోదాడకు చెందిన షేక్ అబ్దుల్ ఫరీద్ ఉద్యోగం సాధించినట్లు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అనంతారపు కృష్ణయ్య గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.అబ్దుల్ ఫరీద్ కోదాడ పట్టణం లోని మాతా నగర్ కు చెందిన దినసరి కూలీ పీర్ సాహెబ్ కుమారుడు.పీర్ సాహెబ్ దంపతులు కష్టపడి పనిచేసి తన కుమారుడిని ఉన్నంతలో చదివించారు.అనంతరం కానిస్టేబుల్ కోచింగ్ కి కోదాడలోని శ్రీ సాయి కోచింగ్ సెంటర్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన అబ్దుల్ ఫరీద్ ను సాయి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అనంతరపు కృష్ణయ్య అభినందించారు
కూలి కొడుకు కానిస్టేబుల్:కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన కూలి కొడుకు అబ్దుల్ ఫరీద్.:శ్రీ సాయి కోచింగ్ సెంటర్ నుండి కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన కోదాడవాసి అబ్దుల్ ఫరీద్
RELATED ARTICLES



