కృష్ణా నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
Mbmtelugunews//చింతలపాలెం మార్చి 11:మండల పరిధిలోని చింతిర్యాల గ్రామంలో ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన షేక్ సైదా హుస్సేన్ కుమారులు పెద్ద కుమారుడుసమీర్, చిన్న కుమారుడు సద్దాం లు ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట లోని ఉర్దూ పాఠశాలలో చదువుకుంటున్నారు. రంజాన్ మాసం సెలవులు కావడంతో సొంత గ్రామానికి వచ్చారు. మంగళవారం ఉదయం తల్లి మిరపకాయలు కోసేందుకు పొలానికి వెళ్ళగా ఆమె బాధ్యతను పిల్లలు తీసుకొని గేదెల మేపుకొనుటకు కృష్ణానది తీరానికి వెళ్లారు. నదిలో కొంత దూరంలో ఉన్న మైదానంలో గేదెలను మేపుటకు తోలుకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం టైం లో వస్తుండగా అనుకోకుండా గుంతలో పడి మునిగి మృతి చెందారు. సాయంత్రం వరకు కూడా పిల్లలు రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి గాలించగా మృతదేహాలు లభ్యం కాలేదు. అప్పటికే చీకటిగా ఉన్నందున తెల్లారి ఉదయం మృతదేహాల కోసం ఎస్డిఆర్ఎఫ్ కోదాడ బృందం గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనపై తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, బంధువులు, దిగ్భ్రాంతికి గురయ్యారు.



