కెఆర్ఆర్ అటానమస్ ప్రభుత్వ డిగ్రీ,పిజి కళాశాల ప్రిన్సిపాల్ గా కళాశాల పూర్వ విద్యార్థి
కోదాడ,ఆగష్టు 13(మనం న్యూస్):తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలలో భాగంగా కెఆర్ఆర్ అటానమస్ ప్రభుత్వ డిగ్రీ,పిజి కళాశాల ప్రిన్సిపాల్ గా కళాశాల పూర్వ విద్యార్థి డా,, చందా అప్పారావు ఈరాజు అదనపు పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది,పుర ప్రముఖులు,కళాశాల పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్ కి అభినందనలు తెలియ చేశారు.ఈ సందర్భంగా కళాశాలకు సహృదయంతో భూమినిచ్చిన కొండపల్లి రాఘవమ్మ,రంగారావు పుణ్యదంపతులను కళాశాల ప్రిన్సిపాల్ ‘పూలమాలతో సత్కరించారు.