కెఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ యోగా దినోత్సవం
Mbmtelugunews//కోదాడ,జూన్ 21 (ప్రతినిది మాతంగి సురేష్):కోదాడ పట్టణంలోని కెఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యోగాసనాలను ఎలా వేయాలి, దానివల్ల కలిగే లాభాలు ఏమిటి అని విషయంలో యోగా గురువు కమిటీ శిక్షకుడు నామ నరసింహరావు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో వివిధ రకాల యోగాసనాలు వేయించి శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ చందా అప్పారావు, పిడి పి ఫ్రాన్సిస్, అధ్యాపకులు నాగిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఎమ్ రఫీ, ఆకుల రాజు, టి రాజు, జి ఎల్ ఎన్ రెడ్డి, పి సైదమ్మ, అధ్యాపకేతర సిబ్బంది బాలరాజు, ఇస్మాయిల్, చంద్రకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.