కెనరా బ్యాంకు విద్యా జ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: బాలాజీ నాయక్
Mbmtelugunews//హుజూర్ నగర్,ఆగష్టు 14:స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులలో ఎక్కువ ప్రతిభ కలిగిన వారిని,పేద విద్యార్థులను కెనరా బ్యాంక్ విద్యా పథకంలో ఎంపిక చేసి 16 వేల రూపాయలు అందజేశారు.వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను ఎంపిక చేసుకుంటామని విద్యార్థులు కష్టపడి చదవాలని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి జయవాణి దేవి మాట్లాడుతూ కెనరా బ్యాంకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్,శ్రీదేవి,మాతంగి మాతంగి ప్రభాకర్ రావు,వెంకటేశ్వర్లు,ప్రసాద్,విజయలక్ష్మి,శైలజ,అస్మామ్ బీన్,అరుణ రాణి,జనార్దన్ రెడ్డి,రవీందర్ రెడ్డి,శేఖర్,మున్ని,నాగేశ్వరరావు,శ్రీకాంత్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.