కెసిఆర్ తో అభివృద్ధి సాధ్యం…
చిలుకూరు,మే 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్::కెసిఆర్ తో అభివృద్ధి సాధ్యమని కోదాడ నియోజకవర్గ భారాస ప్రచార ఇంచార్జ్ కటికం సత్తయ్య గౌడ్ అన్నారు.చిలుకూరు మండల కేంద్రంలో నల్గొండ ఎంపీ భారస అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపునకు ప్రతి కార్యకర్త తమ వంతుగా కృషి చేయాలన్నారు.మండల కేంద్రంలోని అన్ని వీధులలో పార్టీ గుర్తు చూపిస్తూ,గతంలో చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ అన్నపూర్ణ,కస్తూరి నర్సయ్య,కస్తూరి సైదులు,అమరగాని లింగరాజు,బెల్లంకొండ సైదులు,బెల్లంకొండ వేలాద్రి,పిల్లట్ల వెంకయ్య,ఉడుం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.



