కోదాడ,జనవరి 06,(మంతెలుగున్యూస్) ప్రతినిధి మాతంగి సురేష్:బిజెపి ప్రభుత్వం భారత న్యాయ సమిహిత సెక్షన్ 106 డ్రైవర్లు చట్టం కింద ఏక్సిడెంట్ జరగిన తర్వాత గుద్ది పారిపోతున్నారు(హిట్&రన్) అని డ్రైవర్ల పై కటిన చర్యలు తీసుకోవాలని వారికి 10ఏళ్లు జైలు శిక్ష మరియు 7 లక్షల రూపాయలు జరిమానా విధించాలని మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రైవర్లు నిరసనకు మద్దతుగా బాలాజీ నగర్ ఆంజనేయ స్వామి గుడి ఎదుట రోడ్డుపై బేటయించి ధర్నా నిర్వహించిన డ్రైవర్లకు మద్దతు తెలిపిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు భూక్యా రవి నాయక్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనకకి తీసుకొని వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బర్మావత్ రాజు నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు శివలాల్,డ్రైవర్లు భూక్యా శ్రీను నాయక్,భూక్యా నాగేశ్వర్ రావు,భూక్యా చంద్ర శేకర్,ధారవత్ సైదులు,టి సతీష్,మురళి, రాహుల్,గోపి తదితులు పాల్గొన్నారు…
కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లకు విధించిన చట్టాలు వెంటనే రద్దు చేయాలని ధర్నా
RELATED ARTICLES



