కోదాడ,ఫిబ్రవరి23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక రంగా థియేటర్ సెంటర్లో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా కమ్యూనిస్టు రైతు సంఘాల ఆధ్వర్యంలో,ప్రభుత్వ బలగాలు పంజాబ్ హర్యానా బోర్డర్లో రైతాంగ ఉద్యమకారులపై జరిపిన దాడిలో ఒకరు మృతి చెందారు.ఈ ఘటనకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశంలో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నదని,ఢిల్లీ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతాంగం పై కేంద్ర ప్రభుత్వం అత్యంత పాతవికంగా పోలీసు మిలిటరీ చేత రైతులను దేశద్రోహులుగా చూస్తూ వారిపై దాడి చేయడం కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కాల్పుల్లో పంజాబ్ కు చెందిన శుభకరణ్ సింగ్ అనే యువరైతు మృతి చెందాడు.గత ఉద్యమ సమయంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మద్దతు ధరకు చట్టబద్ధత,స్వామినాథన్ కమిటీ సిఫార్సులాంటి తదితర అనేక మైనటువంటి హామీలను అమలు చేయకుండా రైతులను ప్రజలను మభ్యపెడుతు మోసంచేస్తున్న సందర్భంగా తిరిగి రైతాంగం రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్న సందర్భంగా వారిపై తీవ్రమైన దాడి జరపడం ఎక్కడికక్కడ వారిని చిత్రహింసలు గురి చేయడం వారిపై భాష్పవాయుగోళాలుప్రయోగించడం చాలా దుర్మార్గమన్నారు.ఇకనైనా మోడీ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణలు చెప్పి ఆనాడు రైతాంగానికిఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని లేనిపక్షంలో దేశవ్యాప్త రైతాంగ తిరుగుబాటులో మోడీ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదన్నారు.చనిపోయిన శుభ కరణ్ సింగ్ కు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు ఉదయగిరి,సిపిఎం పార్టీ రైతు సంఘం జిల్లా నాయకులు వీరాంజనేయులు,సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కె లతీఫ్,ఏఐకేఎంఎస్ నాయకులు అలుగుబెల్లి సత్యనారాయణ రెడ్డి,దాసరి శ్రీనివాస్,కామల్ల సైదులు,మద్దెల వెంకన్న,జాని,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం!
RELATED ARTICLES



