కేఆర్ఆర్ కళాశాలలో విద్యార్థులకు ఇంట్రెప్రెనేర్షిప్ అవేర్నెస్ కార్యక్రమం
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 28(ప్రతినిధి మాతంగి సురేష్):కేఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో గణిత శాస్త్ర విభాగము ఆధ్వర్యంలో శనివారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి సహకారంతో విద్యార్థులకు ఇంట్రెప్రెనేర్షిప్ అవేర్నెస్ కార్యక్రమం (ఈఎపి) నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఎస్ ప్రతాప్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ హనుమంత రావు లు పాల్గొని విద్యార్థులకు ఈఏపీ గురించి అవగాహన నిర్వహించి చైతన్యపరిచారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేశారు. వివిధ రంగాల్లో రాణిం చడానికి నైపుణ్య మెళకువలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల కు తెలంగాణ ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగిరెడ్డి, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ బి సైదిరెడ్డి, అధ్యాపకుడు డాక్టర్ పల్లపాటి సైదులు, అధ్యా పకులు డాక్టర్ కేశవర్ధన్, ఎస్ ఎమ్ రఫీ, ఆకుల రాజు, ఇతర అధ్యాప, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొ న్నారు.



