కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుల బతుకమ్మ సంబరాలు
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 01(ప్రతినిధి మతంగి సురేష్):స్థానిక కెఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుల బతుకమ్మ పేరుతో బతుకమ్మ సంబరాలు కళాశాల ప్రిన్సిపాల్ డా,చందా అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,మున్సిపల్ కమిషనర్ రమాదేవి హాజరయ్యారు.
ప్రమీల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము.మన చదువులతో పాటు మనం మన సంస్కృతి,సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను తెలుసుకొని ప్రతి ఒక్కరం గౌరవించాలని పేర్కొన్నారు.పువ్వులను పూజించే సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అని కొనియాడారు.ఆడబిడ్డలు అందరూ ఎంతో సంతోషంగా ఈ పది రోజులు బతుకమ్మను గౌరవంగా పూజిస్తూ సాగనంపుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు,విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.