కోదాడ,ఫిబ్రవరి 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో కేలో ఇండియా రేసింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఆధ్వర్యంలో సహజ నైపుణ్య పరీక్షలు నిర్వహించారు.క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలను సీనియర్ కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడలు మానవ జీవితంలో భాగం అన్నారు.అనంతరం సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి,జాతీయ కబడ్డీ క్రీడాకారులు నామా నరసింహారావు మాట్లాడుతూ ఇటువంటి క్రీడా కార్యక్రమాలు చేయడం క్రీడాకారుల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు జాతీయ,అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణించటానికి ముందుకు వెళ్ళొచ్చని కేంద్ర ప్రభుత్వం వారు,కేలో ఇండియా ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం దేశానికి ఎంతో గర్వకారణం అని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సుమారు 150 మంది పాల్గొన్నారు.ఎస్సార్ ప్రైమ్ స్కూల్ జోనల్ ఇంచార్జ్ రణ్ దీర్ మాట్లాడుతూ విద్యార్థులకు జీవితంలో క్రీడలు ఎంతోగానో ఉపయోగపడతాయని అన్నారు.చదువుతో పాటు క్రీడలు అవసరం అన్నారు.కార్యక్రమంలో ఎస్సార్ ప్రైమ్ స్కూల్ జోనల్ ఇంచార్జ్ రణధీర్,ప్రిన్సిపాల్ మునీర్,ఏవో రఫీ,పిఈటి సతీష్,సైదులు,ప్రేమ్,స్వరూప, లక్ష్మణ్,కుమారి, సైదాబీ,శ్రావణి,సురేష్ కుమార్,ఆంజనేయులు,మస్తాన్,శివ ప్రసాద్,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.



