Sunday, December 28, 2025
[t4b-ticker]

కేసీఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ గుడి లింగాన్ని కూడా మింగుతుంది

కేసీఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ గుడి లింగాన్ని కూడా మింగుతుంది

:మాతోపాటు కొట్లాడిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి

:ప్రభుత్వ పాఠశాలను మూసేసింది కేసీఆర్

:పిఆర్సి,టిఏ,డిఏ లు ఇవ్వకుండా మోసం చేసింది కేసీఆర్

:డీఎస్సీ నిర్వహించకుండా మోసం మోసం చేసింది కేసీఆర్

:టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేసింది కేసీఆర్

:ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు కారకుడు అయింది కేసిఆర్

:రాముడు వారసులము మేమే

:మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయడము తప్పే

:రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది కెసిఆర్:జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

కోదాడ,మే 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నల్లగొండ,ఖమ్మం,వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి అధ్యక్షతన స్థానిక కాశీనాదం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మాతోపాటు ఎలాంటి ఆర్థిక లాభాలు ఆశించకుండా కొట్లాడిన వ్యక్తి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కావున మొదటి ప్రాధాన్యత ప్రేమేందర్ రెడ్డి కి వేసి శాసనమండలికి పంపినట్లయితే పట్టభద్రుల పక్షాన పోరాటం చేస్తాడని అన్నారు.కెసిఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ గుడి లింగాన్ని కూడా మింగుతుందని అన్నారు.టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నాపై 109 కేసులు ఉట్టి పుణ్యానికి పెట్టినారని అన్నారు.

టిఆర్ఎస్ పై మేము కొట్లాడితే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటు వేసినారని అన్నారు.ఏందని ప్రజలను అడగగా 6 గ్యారంటీలతో మమ్మల్ని మోసం చేశారని వారు సమాధానం చెప్పారని అన్నారు.కెసిఆర్ ఉద్యమ సమయంలో బ్యాంకులో కారు లోను తీసుకొని లోను కట్టలేక బ్యాంకు వాళ్లు కారును జప్తి చేసినారు.అలాంటి కెసిఆర్ కి ఇప్పుడు కొన్ని వందల కోట్లు ఎలా వచ్చాయని అన్నారు.కెసిఆర్ ఈ వందల కోట్లు తట్ట,పార మోసి సంపాదించలేదు అవి మన డబ్బులే అవి ఎట్టా రాబట్టుకోవాలో మనమే ఆలోచించాలని అన్నారు.ఆరు గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఎలా ఓట్లు వేయించుకున్నదో మళ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకండి అని అన్నారు.కౌలు రైతులకు నిరుద్యోగ భృతి,ఉద్యమకారులకు 2500,విలేకరులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు,అడ్వకేట్లకు నిరుద్యోగ భృతి,రైతులకు 500 బోనస్,స్కూటీలు,రైతు రుణమాఫీ మహిళ భృతి,ఇల్లు జాగా లేని వారికి ఐదు లక్షల రూపాయలు,తులం బంగారం అని మాయమాటలు చెప్పి ఓటేయించుకున్న కాంగ్రెస్ ఒకటైన అమలు చేసిందా అని అన్నారు.

అసెంబ్లీలో వీటన్నిటిపై అడుగడుగునా అడ్డుకోవడానికి ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేశారు.టిఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అనుకూల వాతావరణం వీస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్టబదుల చేతిలో ఉందని అన్నారు.మేము చౌరస్తా గల్లీలలో గ్రామాలలో పోట్లాడుతాము మీరు మాత్రం పట్రబుద్దుల ఎన్నికలలో ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్లయితే శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా నిరుద్యోగుల,ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తాడని అన్నారు.మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయడం తప్పే వాటిని మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.రాజకీయాలు ముఖ్యం కాదు ధర్మమే ముఖ్యమని అన్నారు.మైనార్టీ డెకరేషన్ అన్నది 80% హిందువుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వద్దు 12 శాతం ముస్లింల ఓట్లు మాత్రం కాంగ్రెస్ కి కావాలని అన్నారు.రాముని వారసులము మేమే కెసిఆర్ కి ఇప్పటికీ నిద్ర పట్టదు బండి సంజయ్ గుర్తుకొస్తుంటాడని అన్నారు.కేంద్రంలో నరేంద్ర మోడీ మేడ్,మేకు,డిజిటల్,స్టాపస్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాడని గుర్తు చేశారు.ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు.భారతదేశ దశ దిశ మార్చిన ఏకైక వ్యక్తి మోడీ అని అన్నారు.317 జీవో ని బిఆర్ఎస్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురి చేస్తే వారి పక్షాన నిలబడి పోరాడింది నేనే అని అన్నారు.14 విశ్వవిద్యాలయాలు ఉంటే 70% బోధన సిబ్బంది ఖాళీగా ఉందని గుర్తు చేశారు.కేంద్రం నిధులు సక్రమంగా అమలు కావాలంటే మన ప్రతినిధి అవసరం కావున శాసనమండలలో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు.నిరుద్యోగులు,ఉద్యోగులు,రైతాంగం పక్షాన పోరాటం చేసింది బిజెపి అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకినేని వెంకటేశ్వరరావు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్రకాష్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్,హైదరాబాద్ మాజీ మేయర్ సుభాష్ చంద్ర జి,బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్,అక్కిరాజు యశ్వంత్,కనగాల వెంకటరామయ్య,కనగాల నారాయణ,నూనె సులోచన,బోలిశెట్టి కృష్ణయ్య,వంగవీటి శ్రీనివాసరావు,కవితా రెడ్డి,శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular